Event Details
- Date: –
ట్రస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే అవగాహనా ర్యాలీ.
కాకినాడ: ప్రపంచ గుండె ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ట్రస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ జరిగింది. సర్పవరం జంక్షన్ నుండి ట్రస్ట్ హాస్పిటల్ వరకు జరిగిన ర్యాలీని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.వై.కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ గుండె ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై మూడు ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఎస్.సి.హెచ్.ఎస్. రామకృష్ణ మాట్లాడుతూ ట్రస్టు హాస్పిటల్, రోటరీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ గుండె ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కలిపిస్తున్నామన్నారు. పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఆరోగ్య శ్రీ ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు ఉత్తమ చికిత్సలు అందిస్తున్నామన్నారు. నొప్పి అనిపించిన వెంటనే దగ్గర లోని ఉపకరణాలు కలిగిన హాస్పిటల్ కు వెళ్లి తక్షణ చికిత్స పొంది వెడితే ప్రాణం నిలుపుకోవచ్చునన్నారు. ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ ట్రస్ట్ హాస్పిటల్ గుండె వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం సంతోష దాయకంగా ఉందన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా అనేక వ్యాధులకు చికిత్స అందిస్తోందన్నారు.వైద్యులు ప్రభుత్వ పథకాలు వినియోగించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.కార్యక్రమంలో సిటీ సర్జన్ డా.వి.రామకృష్ణ కార్డియాలజిస్ట్ డా.పీవీ. నిఘంత్, డా.బి. దుర్గా పవన్ కుమార్, జనరల్ మెడిసిన్ డా.ఫణి రామ్, నెఫ్రాలజిస్ట్ డా.ప్రవీణ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.